బెల్లంపల్లి పట్టణంలోని 5, 6 వార్డుల్లో మహిళా సంఘాలకు రుణాల కోసం కొంతమంది తనను బెదిరిస్తున్నారని ఆర్పి రజిత ఆరోపించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రుణం కట్టనప్పటికీ కొత్తగా ఇప్పించాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణం చెల్లించకపోవడంతో పాటు తనపైనే అకారణంగా ఫిర్యాదు చేస్తున్నారని వాపోయారు. ఆర్ పి రజిత మున్సిపల్ కమిషనర్ తో పాటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.