ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం భీమిని మండలంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.