రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ఆరోపించారు. బుధవారం బెల్లంపల్లి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం వద్ద విద్యాశాఖ ఉన్నా కూడా విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.