కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 350 రోజుల అనంతరం ప్రజాదర్బార్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకరోజు కార్యక్రమంలా కాకుండా నిరంతర ప్రక్రియగా ప్రజా దర్బార్ ఉండే విధంగా ఎమ్మెల్యే వినోద్ చర్యలు తీసుకోవాలని కోరారు.