బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.