బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల దవాఖానాలో శనివారం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూతురు వర్ష హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వైద్య శిబిరాన్ని నెన్నెల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక కంటి వైద్యుల ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.