బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసింహస్తి స్క్రాప్ దుకాణానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. ప్రజా దర్బార్ లో స్క్రాప్ దుకాణంతో ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. అరకొర స్క్రాప్ వస్తువులను తరలించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకొని మొత్తం తరలించాలని పట్టుబడ్డారు. దీంతో చేసేదేం లేక స్క్రాప్ దుకాణానికి తాళం వేసి సీల్ వేశారు.