బెల్లంపల్లి మండల శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ తో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు శనివారం వినతిపత్రం సమర్పించారు. మండలంలోని చిన్నబూధే, పెద్దబూదే, కాశిరెడ్డిపల్లి, ఇంద్రనగర్ లకు చెందిన సాగుభూములు కోల్పోతున్నామని వారు పేర్కొన్నారు. భూమిని కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.