బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వరంగల్ ఆర్డీఎంఏలో ఎంసీపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పస్సులేటి వెంకటేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అక్రమ నిర్మాణాలపై స్థానిక ఆర్డీవో, తహసిల్దార్, మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు వాటికి సహకరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.