జనహితసేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో విద్యార్థులు వంద మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో పట్టణంలో నిర్వహిస్తున్న నిత్య జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమం బుధవారంతో 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.