వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని టియుసిఐ సి. రాజు ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత మూడు నెలల నుంచి కార్మికులకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికులు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.