మానవత్వ విలువలతో కూడిన ఉన్నత వృత్తి వైద్య వృత్తి అని వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునందిని అన్నారు. మంగళవారం వైద్య కళాశాలలో 2024-25 నూతన విద్యార్థుల పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీతో వైద్యవిద్యాను అభ్యసించి భవిష్యత్తులో మానవత్వ విలువలు, కల్పనత్వం వైద్య వృత్తిలో నిష్ణాతులవ్వాలని ఆకాంక్షించారు.