వనపర్తి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇల్లు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.