వసతి గృహాలకు సరఫరా అయ్యే బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు నాణ్యత లేకుంటే తిరిగి పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ కళాశాల వసతి గృహాన్ని, ఐజయ్య కాలనీలోని ప్రభుత్వ షెడ్యూల్డు కులాల బాలుర వసతి గృహం, కళాశాల వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను, స్టాక్ రికార్డును పరిశీలించారు.