దీపావళి పర్వదినాన్ని నవంబర్ ఒకటవ తేదీన జరుపుకోవాలని శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన వేద పండితులు జోషి గోపాలు శర్మ తెలిపారు. అక్టోబర్ 31న నరక చతుర్దశి, నవంబర్ 1వ తేదీన దీపావళి అమావాస్య వస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ఎంతో ప్రాచీన గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారం వీటిని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.