ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూలరి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1. 20 లక్షల ఇన్ ప్లో చేరడంతో శనివారం 20గేట్లు 1. 5 మీటర్ల మేర శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు కేంద్రంలో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.