బీఆర్ఎస్ హయంలో పత్తి సాగుకి ప్రోత్సహించామని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు దళారుల చేతుల్లోకి పత్తి పోవాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు ఐదారు వేలకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ పత్తి వల్లే సీసీఐకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వచ్చిందన్నారు.