వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇంద్ర కాలనీలో కళాకారులచే శనివారం ఆరోగ్య అంశాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ఈగలు, దోమల వల్ల జబ్బులు, డ్రగ్స్ వల్ల అనర్థాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలను వివరించారు. పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన జ్వాల కవి, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ మెంబర్ గంధం నాగరాజు, కళాబృందం సభ్యులు సువర్ణ, రాధ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.