ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. ఏ ఒక్క ఇంటిని వదలకుండా, ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేయాలని సూచించారు.