వనపర్తి జిల్లాలో రైతులకు మేలు చేయడమే కాకుండా, మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంచాలకులు విఎన్విఎస్. ప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఒసీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లాలోని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. విఎన్విఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. మిల్లర్లు నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు.