వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం నాగరాల గ్రామం సెంటర్-1 కు చెందిన పులేందర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మంగళవారం పరామర్శించారు. సోమవారం పులేందర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై తల్లి, కూతుర్లు ఇద్దరు మృతి చెందిన విషయాన్ని తెలుసుకునిన ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తక్షణ సహాయంగా 20 వేల రూపాయలు అందించారు.