తెలంగాణ హైకోర్టు ఫారెస్ట్ కౌన్సిల్ గా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన సీనియర్ న్యాయవాది వై. విజయభాస్కర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆత్మకూరు మండల మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ లు శాలువాతో సన్మానించి, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెన్నయ్య, అశ్విన్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మాసన్న, తదితరులు పాల్గొన్నారు.