పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అల్పాహారం, భోజనాన్ని అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేటలోని కస్తూర్బా పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల, సింగారం కూడలిలోని దామరగిద్ద బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యాన్ని పరిశీలించి, బాగా లేకపోతే తిరిగి పంపించాలని సూచించారు.