ఈనెల 25న నారాయణపేట్ జిల్లా కేంద్రంలో నిర్వహించే యాదవుల సదర్ ప్రదర్శనను విజయవంతం చేయాలని యాదవ మహా సభ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సిటిజన్స్ క్లబ్ లో సదర్ ఉత్సవాల కర పత్రాలను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారని సదర్ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బాలప్ప యాదవ్, కన్వీనర్ రఘువీర్ యాదవ్ అన్నారు.