ఐకేపీ ల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం నారాయణపేట సీవీఆర్ భవన్ లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ని కలిసి వినతి పత్రం అందించినట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో మహిళా సంఘాలకు కమిషన్ రూపంలో ఆదాయం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.