గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట ఎంపీడీవో కార్యాలయం ముందు టియుసిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పాల్గొన్నారు.