గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర నాయకులు నరసింహ గురువారం ఒక ప్రకటనలో కోరారు. గత ఆరు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.