అనుమతులు లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట జిల్లాలో నేటి నుంచి ఈనెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు అనుమతులు లేకుండా చేపట్టరాదని సూచించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.