నారాయణపేట పట్టణంలో జరుగుతున్న గ్రూప్ - 3 పరీక్ష కేంద్రాలను ఆదివారం డిఎస్పీ లింగయ్య పరిశీలించారు. భద్రత సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. డిఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్ 144 సెక్షన్ అమలు చేశారని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు వుంటుందని చెప్పారు.