నారాయణపేట: సైబర్ నేరాలపై అవగాహన

76பார்த்தது
నారాయణపేట: సైబర్ నేరాలపై అవగాహన
నారాయణపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మకూడదని, బ్యాంకు ఖాతా, ఓటిపి, ఏటిఎం కార్డు వివరాలు ఇవ్వకూడదని చెప్పారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయాలని అన్నారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు తెరవకూడదని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி