ప్రజల సంక్షేమం కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బుధవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతయ్య అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ కృషితో ప్రజలకు విద్యుత్ చార్జీల భారం తప్పిందంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మరికల్ ఇందిరాగాంధీ కూడలిలో బిఆర్ఎస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సుమారు రూ. 18 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం నుండి తప్పించారని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.