మరికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసిన కన్మనూర్ గ్రామానికి చెందిన మాలే ఆంజనేయులు అనే వ్యక్తికి నారాయణ్ పేట్ కోర్టు జడ్జి ఎండీ ఉమర్ 6 నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా వేస్తూ బుధవారం తీర్పు వెల్లడించారని డిఎస్పీ లింగయ్య తెలిపారు. ఆగస్టు 11, 2024 లో బాలిక కనిపించడం లేదని తల్లితండ్రులు మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.