మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి కారణంగా ఉదయం నుండి మేఘావృతమై వున్న వాతావరణం సాయంత్రం ఒక్క సరిగా భారీ వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అత్యవసరము అయితే తప్ప బయటికి వెళ్లరాదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.