చెంచు గిరిజనులకు ఆధార్, రేషన్ కార్డులతో పాటు కుల, స్థానిక, జనన, మరణ ఇతర ధ్రువపత్రాలను జారీ చేసేందుకు మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ ఏర్పా టు చేశామని ఆర్డీవో మాధవి తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో ఆర్డీవో పర్యటించారు. శనివారం 200 మంది గిరిజనులు హాజరైనట్లు తెలిపారు. అచ్చంపేటలో చెంచు గిరిజనుల కోసమే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.