బల్మూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీపీఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దేశ్యానాయక్ కోరారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని సందర్శించారు. చలి కాలం ప్రారంభమైనా దుప్పట్లు రాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరానాయక్, నాగరాజు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.