కార్మిక వెల్ఫేర్ బోర్డును ఎల్ఐసికి అప్పగించవద్దని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి కాటంరాజులు కోరారు. మంగళవారం ఆమనగల్లులో భవన కార్మిక సంఘం ఆమనగల్లు ఏరియా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి భవన కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని సూచించారు. కార్మికుడు మరణిస్తే ఇచ్చే 6. 30 లక్షల రూపాయలను 10 లక్షల పెంచాలని వారు డిమాండ్ చేశారు.