మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైన ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్చార్జి విజయలక్ష్మి అన్నారు. శని వారం బిజినేపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ పాఠశాలలో షీటీం ఆధ్వర్యంలో ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాధితులు 100 లేదా 8712657676 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చన్నారు. భరోసా కేంద్రం ద్వారా అందుతున్న సేవలను వివరించారు.