తెల్కపల్లి మండలం వట్టిపల్లికి చెందిన శివశంకర్, నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన విష్ణు ఈనెల 19న మద్యం తాగి పట్టణంలో ద్విచక్ర వాహనాలు నడిపారు. పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి శనివారం న్యాయమూర్తి రాములు ఎదుట హాజరుపర్చారు. శివశంకర్ కు రూ. వెయ్యి జరిమానా, 15 రోజుల పాటు జైలు శిక్ష, విష్ణుకు ఒక రోజు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.