వెల్డండ మండలంలోని బీసి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని పీడీ ఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ శ్రీశైలం హైవే రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డికి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. వెల్దండ బీసీ హాస్టల్లో నాణ్యమైన భోజనం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ స్పందించి సమస్యలన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.