కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మహేష్ గౌడ్ అన్నారు. శనివారం ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికుల తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్లతో టాడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు.