మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించారు. వంట గది, వంట సామాగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వికటించడానికి కారణమైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలం, నాయకులు పాల్గొన్నారు.