రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు వరికి రూ. 500 రూపాయలు బోనస్ చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవంతు డిమాండ్ చేశారు. శుక్రవారం మక్తల్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు అమలు చేయాలని, పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.