Oct 23, 2024, 02:10 IST/
నేడు వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామినేషన్
Oct 23, 2024, 02:10 IST
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు నేడు (బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వీరి సమక్షంలో నామినేషన్ పత్రాలను ప్రియాంక దాఖలు చేయనున్నారు.