కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో రణరంగం
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కొడంగల్ లోని దుద్యాల మండలం రోటిబండ తండాలో శుక్రవారం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తండా వాసులు ఆందోళన చేపట్టగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాగా కొందరు స్థానిక కార్యాలయంపై రాళ్లను ఎత్తేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.