వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం సభ్యత్వ అధ్యక్షుడు మున్నూరు రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని బూతు స్థాయి లీడర్లకు ఆయన సూచించారు. కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు తెలిపారు.