మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను త్వరలో ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించనున్నారు. 1956లో 32 ఎకరాల స్థలంలో కళాశాలలను నెలకొల్పారు. ప్రస్తుతం కళాశాలలో 1, 620మంది విద్యార్థులు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలలో చదువుతున్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో పాలమూరుకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మంగళవారం విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.