నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సూర్య వంశి ఆరెకటిక్ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గా మాత ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రాకేష్, రఘు, విజయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.