వక్స్ సవరణ బిల్లుపై జేపీసీ అధ్యయనంలో ఛైర్మన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీలో జేపీసీ తెలంగాణ సభ్యురాలు ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలు, పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై కీలక చర్చలు జరిపారు. వక్స్ సవరణ బిల్లు తుదిదశకు చేరిన మేరకు కమిటీ స్టడీ నివేదిక తయారీలో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.