సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతున్నదని, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం సీఎంతోనే సాధ్యమని ఆటో డ్రైవర్స్ యూనియన్ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.