మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.